ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. ఈ సారి టోర్నీలో ఆమె క‌నిపించ‌దోచ్‌

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్‌.. ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభానికి ముందు గ‌త కొన్ని సీజ‌న్లుగా త‌న అందంతో పాటు త‌న మాట‌ల‌తో అల‌రించే యాంక‌ర్ మాయంతి లాంగ‌ర్ ఐపీఎల్ 2020లో ఎడిష‌న్లో క‌నిపించారు. అయితే ఈ సారి ఐపీఎల్ నుంచి ఆమెను త‌ప్పించిన‌ట్టు స్టార్ స్పోర్ట్స్ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో తెలిపింది. ఈ మెగా ఈవెంట్ యాంక‌ర్ల లిస్టులో మాయంతి పేరు లేదు.

 

ఐపీఎల్ అంటే ఆటే కాదు.. కావాల్సినంత గ్లామ‌ర్ కూడా క‌నిపిస్తుంటుంది. చీర్ గ‌ర్ల్స్ మొద‌లుకుని.. యాంక‌ర్ల వ‌రకు టోర్నీలో ప్ర‌తిదీ ఆక‌ర్ష‌ణీయ‌మే. అలాంటిది ఈ మెగా ఈవెంట్‌లో మాయంతి లాంటి యాంక‌ర్ లేక‌పోవ‌డం పెద్ద లోటే అని చెప్పాలి. మయాంతి ఎందుకు ఈ టోర్నీలో యాంకర్‌గా వ్వవహరించడం లేదని దానిపై ఇంకా స్పష్టత లేదు.

 

మాయంతి వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఈ లీగ్ నుంచి త‌ప్పుకుందా ?  లేదా స్టార్ స్పోర్ట్స్ యాజ‌మాన్య‌మే ఆమెను త‌ప్పించిందా ? అన్న‌ది తెలియాల్సి ఉంది.

Leave a comment