Gossipsబాబోయ్‌... త్రివిక్ర‌మ్ సినిమా కోసం ఎన్టీఆర్ ఇంత రిస్క్ చేస్తున్నాడా...!

బాబోయ్‌… త్రివిక్ర‌మ్ సినిమా కోసం ఎన్టీఆర్ ఇంత రిస్క్ చేస్తున్నాడా…!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. హారిక హాసిని క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే ప‌ట్టాలెక్క‌నుంది. త్రివిక్ర‌మ్ మార్క్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది.

 

ప్రస్తుతం ఈ సినిమా హీరోయిన్ ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ స‌ర‌స‌న ఓ టాప్ హీరోయిన్ న‌టిస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ భారీ రిస్క్ చేస్తున్నాడ‌ని అంటున్నారు. సినిమా క్లైమాక్స్‌లో క‌థ రీత్యా హీరో పాత్ర చనిపోతుంద‌ట‌. అప్పుడే ఇది క‌థ‌కు బ‌లం అవుతుంద‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్నాడ‌ట‌.

 

అయితే యాంటీ క్లైమాక్స్ స్ట్రాట‌జీతో తెర‌కెక్కిన సినిమాలు తెలుగులో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌క్సెస్ కాలేదు. అందులోనూ ఎన్టీఆర్ లాంటి క్రేజీ హీరో క్లైమాక్స్‌లో మ‌ర‌ణిస్తే అది ఫ్యాన్స్ జీర్ణించుకోలేరు. మ‌రి ఎన్టీఆర్ ఇలాంటి భారీ రిస్క్‌కు ఓకే చెపుతాడా ? అన్న‌ది చూడాలి. ఒక‌వేళ ఇది నిజం అయితే ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ ఇద్ద‌రు భారీ రిస్క్ చేస్తున్న‌ట్టే అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news