Moviesబాలీవుడ్‌కే దిమ్మ‌తిరిగేలా ప్ర‌భాస్ 22 ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.. ఐదు భాష‌ల్లో ఆదిపురుష్...

బాలీవుడ్‌కే దిమ్మ‌తిరిగేలా ప్ర‌భాస్ 22 ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.. ఐదు భాష‌ల్లో ఆదిపురుష్ ఎనౌన్స్‌

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ రోజు ఉద‌యం బిగ్ స‌ర్‌ప్రైజ్ ఇస్తాన‌ని ప్ర‌భాస్ గ‌త రాత్రే ప్ర‌క‌టించాడు. ముందుగా చెప్పిన‌ట్టుగానే 7.11 గంట‌ల‌కు అదిరే అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. గ‌త కొద్ది రోజుల నుంచి వినిపిస్తోన్న చ‌ర్చ‌ల ప్ర‌కార‌మే త‌నాజీ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ అనే భారీ ప్రాజెక్టును ప్ర‌కటించాడు. ఈ ప్రాజెక్టు ప్ర‌క‌ట‌న వ‌చ్చిందో లేదో సోష‌ల్ మీడియాలో ఈ పోస్ట‌ర్ దుమ్మురేపుతూ దూసుకుపోతోంది. ఈ ప్ర‌క‌ట‌న బాలీవుడ్‌కే దిమ్మ‌తిరిగి పోయేలా ఉంది. ప్ర‌భాస్ వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో దూసుకుపోతున్నాడు.

 

ఇక పోస్ట‌ర్‌లో ఏ అనే ఆంగ్ల అక్ష‌రం హైలెట్ చేస్తూ అందులో కామిక‌ల్ కినిప‌స్తోన్న హ‌నుమాన్ విల్లు ప‌ట్టుకుని ఉన్న రాముడు ఉన్నారు. అలాగే కింద ప‌ది త‌ల‌ల రావ‌ణుడిలా ఉన్న మ‌రో డిజైన్ కూడా ఆక‌ట్టుకుంది. ఇవ‌న్నీ చూస్తుంటే ప్ర‌భాస్ క‌టౌట్‌కు స‌రిప‌డా మ‌రో భారీ పాన్ ఇండియా సినిమా తెర‌కెక్క‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమా మొత్తం ఐదు భాష‌ల్లో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ మరియు మళయాళ భాషల్లో తెరకెక్కించనుండగా గుల్షన్ కుమార్ మరియు టి సిరీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news