కోవిడ్ – 19 టెస్టుల్లో ఇండియా స‌రికొత్త రికార్డు… ప్ర‌పంచంలోనే ఈ ఘ‌న‌త భార‌త్‌దే…!

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు స్వైర‌విహారం చేస్తున్నాయి. ఇక మ‌న దేశంలో క‌రోనా కేసులు ఇప్పటికే 17 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. గ‌త 24 గంట‌ల్లోనే ఏకంగా క‌రోనా కేసులు 853గా న‌మోదు అయ్యాయి. ప్ర‌తి రోజు స‌గ‌టున 50 వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో 54 వేల కేసులు న‌మోదు అయ్యాయి. ఇక దేశంలో క‌రోనా తీవ్రత రోజు రోజుకు ఎక్కువ అవుతోన్న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను కూడా పెంచింది. గ‌త కొద్ది రోజులుగా చూస్తే మ‌న దేశంలో స‌గ‌టున రోజుకు ఏకంగా 4-5 ల‌క్ష‌ల శాంపిల్స్ ప‌రీక్షలు జ‌రుగుతున్నాయి.

 

తాజాగా శ‌నివారం ఒక్క రోజే ఏకంగా 4,63,172 శాంపిళ్లకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కోటీ 98లక్షల (1,98,21,831) శాంపిళ్లకు కొవిడ్‌ టెస్టులు పూర్తిచేసినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే అత్య‌ధికంగా క‌రోనా నిర్దార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే 5 కోట్ల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

 

అధిక టెస్టులు చేస్తోన్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు ట్రంప్‌ ఇదివరకే స్పష్టం చేశారు. ఏదేమైనా త‌క్కువ స‌మ‌యంలో భార‌త్ ఎక్కువ కోవిడ్ ప‌రీక్ష‌లు చేయ‌డం రికార్డుగానే భావించాలి. ఇక మ‌న దేశంలో కరోనా కేసుల సంఖ్య 17,50,724కి చేరాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 5,67,730 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 11,45,630 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా మృతులు సంఖ్య 37,364కు చేరింది.

Leave a comment