క‌రోనా ఘోరం: క‌రోనాతో పోరాడి ఆ రాష్ట్ర విద్యాశాఖా మంత్రిని బ‌లి..

దేశంలో కరోనా వైరస్‌ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే మ‌న దేశంలో క‌రోనా కేసులు ఏకంగా 17 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. రోజు రోజుకు కేసులు విప‌రీతంగా పెరిగి పోతున్నాయి. క‌రోనా దెబ్బ‌కు చివ‌ర‌కు సామాన్యులే కాకుండా సెల‌బ్రిటీలు కూడా బ‌లైపోతున్నారు. తాజాగా క‌రోనా దెబ్బ‌కు ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి కమలా రాణి మృతి చెందారు. ఇటీవ‌ల క‌రోనా భారీన ప‌డ్డ ఆమె కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఆదివారం మృతి చెందారు. ప్ర‌స్తుతం క‌మ‌లా రాణి యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

 

యూపీలో క‌రోనా వ్యాప్తి చెందుతున్న‌ప్పుడు ప్ర‌భుత్వం క‌రోనాకు వ్య‌తిరేకంగా చేప‌ట్టిన ప్ర‌తి కార్య‌క్ర‌మంలోనూ ఆమె పాల్గొన్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె అనారోగ్యానికి గుర‌య్యారు. ఆమెకు కోవిడ్ ప‌రీక్ష‌లు చేయ‌గా క‌రోనా వ‌చ్చినట్టే తేలింది. అప్ప‌టి నుంచి ఆమె చికిత్స తీసుకుంటున్నా క‌రోనా దెబ్బ‌కు బ‌లైపోయారు. ఆమె వ‌య‌స్సు 62 సంవ‌త్స‌రాలు. ఆమెకు ఇప్ప‌టికే ఉన్న ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్ స‌మ‌స్య కూడా ఆమె త్వ‌ర‌గా మృతి చెంద‌డానికి కార‌ణ‌మంటున్నారు. ఇక ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండ‌ల మాణిక్యాల‌రావు సైతం క‌రోనాతో నిన్న మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.

Leave a comment