Politicsకోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు తిరుగులేని వైద్యం... ఇంట్లో ఉండి ఈ ప‌ని చేస్తే...

కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు తిరుగులేని వైద్యం… ఇంట్లో ఉండి ఈ ప‌ని చేస్తే చాలు వైర‌స్ ప‌రారే…!

చికిత్స కన్నా నివారణే మేలు. ఈ మాట మనందరికీ అందరికీ తెలిసిందే. రోగం వ‌చ్చాక వైద్యం చేయించుకోవ‌డం క‌న్నా.. ఆ రోగం రాకుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటేనే చాలా బెట‌ర్ అన్న అభిప్రాయం స‌ర్వ‌త్రా ఉంది. ఇప్పుడు కోవిడ్ విష‌యంలో ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాం.. వీటితో పాటు మ‌రికొన్ని ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే అస‌లు ఈ మ‌హ‌మ్మారి ద‌రి చేర‌కుండా చూసుకోవ‌చ్చు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కేంద్ర ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో మంత్రిత్వ శాఖ (ఆయుష్ శాఖ) చెబుతోంది.

 

రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకునేందుకు కొన్ని ప‌ద్ద‌తులు కూడా ఉన్నాయి…
– దాహం అనిపించినప్పుడల్లా గోరు వెచ్చని నీటినే తాగ‌డంతో పాటు రోజూ క‌నీసం 30 నిమిషాలు యోగా చేయాలి.
– రోజువారీ వంటకాలలో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోండి.. రోజు కనీసం 20 నిమిషాల పాటు ఎండలో ఉండాలి.
– ప్రతి రోజూ ఉదయం ఒక టీస్పూను చవనప్రాశ్ తినాలి. మధుమేహ వ్యాధి ఉన్నవారు చక్కెర లేని చవనప్రాశ్ తీసుకోవాలి
– తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష మొదలైనవాటితో చేసిన ఆయుర్వేద తేనీరు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగాలి.
– 150 మిల్లీ లీటర్ల పాలలో అరస్పూను పసుపు కలుపుకొని రోజుకు ఒకటి లేక రెండుసార్లు తాగాలి.

 

ఇక ఆయుర్వేద ప‌ద్ధ‌తుల విష‌యానికి వ‌స్తే….
– నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా నెయ్యిని ముక్కు రంధ్రాల దగ్గర పట్టించాలి.
– ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను తీసుకుని నోటిలో వేసుకుని రెండు మూడు నిమిషాలపాటు పుక్కిలించాలి.
– పొడిదగ్గు ఉంటే పుదీనా ఆకులను లేదా సోపు గింజలు కలిపిన నీటి ఆవిరిని రోజుకు ఒకసారి పీల్చుకోవాలి
– లవంగాల పొడిని బెల్లంతో లేదా తేనెతో కలుపుకుని రోజుకు రెండుసార్లు తీసుకుంటే దగ్గు లేదా గొంతు గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది.
– ఒకవేళ పొడి దగ్గు ఎక్కువగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి
– లవంగాలు పొడిచేసుకొని చక్కెర, తేనెలో కలిపి రోజూ రెండుమూడుసార్లు తినాలి.

 

ఇక పైన చిట్కాల‌తో పాటు క్యారెట్లు, ఆకుకూర‌లు, చిల‌గ‌డ‌దుంప‌, కీరాదోస‌, మామిడి పండ్లు, క‌ర్బూజా పండ్లలో, యాప్రికాట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మ‌న శ‌రీరంలో విట‌మిన్-ఎ గా మారి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఇక తెల్ల‌ర‌క్త‌క‌ణాలు పెంచే విట‌మిన్ సీ ఎక్కువుగా ఉండే నారింజ‌, ద్రాక్ష‌, బ‌త్తాయి తీసుకోవాలి.

 

విట‌మిన్ డీ ఇన్‌పెక్ష‌న్ల‌ను నిరోధిస్తుంది. దీని కోసం ఎండ‌లో ఉండ‌డంతో పాటు చేప‌లు, గుడ్లు, పాలు, చీజ్‌, వెన్న, ప‌నీర్‌, పుట్టగొడుగులలోనూ విట‌మిన్-డి ల‌భిస్తుంది. వీటిని త‌ర‌చూ తీసుకోవాలి. ఇక పౌల్ట్రీ ఉత్పత్తులు, సోయాబీన్‌, మాంసం, శ‌న‌గ‌లు, చిక్కుడు జాతి గింజ‌లు, చిరు ధాన్యాలు, గింజ‌లు, చీజ్, ప‌నీర్‌, పెరుగుల‌లో జింక్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు జింక్ ల‌భిస్తుంది. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news