బ్రేకింగ్‌: మ‌రో ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్‌…

క‌రోనా వ‌రుస పెట్టి వ‌ద‌ల‌కుండా ఎమ్మెల్యేల‌ను ఎటాక్ చేస్తోంది. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేలు క‌రోనా భారీన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ లిస్టులో మ‌హారాష్ట్ర‌, ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మ‌రో ఎమ్మెల్యే చేరిపోయారు. ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సౌరబ్ బహుగుణాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలోని యూఎస్ నగర్ సీతార్ గంజ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. బ‌హుగుణా కొద్ది రోజులుగా అస్వ‌స్థ‌త‌తో ఉన్నారు. ఆయ‌న్ను హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించి ప‌రీక్షలు చేయ‌గా కోవిడ్‌-19 అని తేలింది.

 

ఇక బ‌హుగుణాతో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా కరోనా సోకింది.కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ కు జులై 30న కరోనా సోకడంతో అతను డూన్ ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రిలో చేరారు. ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ కూడా గతంలో కరోనా భారిన పడ్డారు.