Politicsఆ వైసీపీ నేత కొడుకుతో ఎంపీ కోమ‌టిరెడ్డి కుమార్తె పెళ్లి ఫిక్స్‌

ఆ వైసీపీ నేత కొడుకుతో ఎంపీ కోమ‌టిరెడ్డి కుమార్తె పెళ్లి ఫిక్స్‌

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూతురు ఎంగేజ్మెంట్ అతి కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో వైభ‌వంగా జ‌రిగింది. ఆయ‌న ఏపీలోని క‌ర్నూలు జిల్లా కు చెందిన వైసీపీ నేత ( నంద్యాల మాజీ ఎమ్మెల్యే) శిల్పా మోహ‌న్‌రెడ్డి సోద‌రుడు శిల్పా ప్ర‌తాప్‌రెడ్డితో వియ్యం అందుకుంటున్నారు. ప్ర‌తాప్‌రెడ్డి కుమారుడితో కోమ‌టిరెడ్డి కుమార్తె వివాహం జ‌రిగింది. ఇక శిల్పా మోహ‌న్‌రెడ్డి గ‌తంలో కాంగ్రెస్ నుంచి మంత్రిగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు ర‌వికిషోర్ రెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా ఉండ‌గా.. మోహ‌న్‌రెడ్డి మ‌రో సోద‌రుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

 

ఇక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేత‌ల‌తో మంచి సంబంధాలు క‌లిగి ఉన్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడే రాజ్‌గోపాల్‌రెడ్డి భువ‌న‌గిరి ఎంపీగా గెలిస్తే.. కోమటిరెడ్డికి మంత్రి ప‌ద‌వి వచ్చింది. ఆ సమయంలోనే సీఎం జగన్ తో కూడా మంచి అనుబంధం ఏర్పడింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news