క‌రోనాకు ఇంటి వ‌ద్దే చికిత్స‌… ఇలా చేస్తే ఇప్పుడు క‌రోనా త‌గ్గినా భ‌విష్య‌త్తులో డేంజ‌ర్లోకే…!

ప్ర‌పంచ మ‌హమ్మారి క‌రోనాకు ఇప్ప‌టి వ‌ర‌కు మందు లేదు. ఎవ‌రికి వారు వ్యాక్సిన్ త‌యారు చేస్తున్నామ‌ని చెపుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఏ వ్యాక్సిన్ కూడా క‌రోనాను త‌గ్గిస్తుంద‌ని అధికారికంగా ఎవ్వ‌రూ చెప్ప‌డం లేదు. మ‌రోవైపు ర‌ష్యా మాత్రం మా వ్యాక్సిన్ రెడీ అయ్యింద‌ని.. ఆగ‌స్టు 10వ తేదీ నుంచి ప్ర‌జ‌ల‌కు త‌మ వ్యాక్సిన్ పంపిణీ చేస్తామ‌ని చెపుతోంది. ఇక క‌రోనాకు మందు లేక‌పోవ‌డంతో చాలా మంది రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎలా పెంచుకోవాలో చెపుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి ఒక్క‌రు కేవ‌లం రోగ నిరోధ‌క శ‌క్తి ఎలా పెంచుకోవాల‌న్న దానిపైనే క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.

 

ఈ క్ర‌మంలోనే అమెరికాలో స్టెరాయిడ్ల‌తో చేస్తోన్న చికిత్స‌తో మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ట‌. ఈ వైర‌స్‌ను నియంత్రించ‌గ‌ల ఒకే ఒక్క మార్గంగా స్టెరాయిడ్లు ఉన్నాయ‌ని పలువురు కరోనా రోగులు చెపుతున్నారు. ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు స్టెరాయిడ్లు క‌రోనాను ఎదుర్కొనే విష‌యంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకునేందుకు చాలా ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తున్నాయ‌ని చెపుతున్నారు. వీటితో బాధితులు కోలుకోవ‌డంతో పాటు క‌రోనాను ఎదుర్కొనే విష‌యంలో చాలా మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయంటున్నారు.

 

ప్ర‌స్తుతం అమెరికాలోని క‌రోనా రోగుల్లో ఏకంగా 80 శాతం మంది ఇంటి వ‌ద్ద‌నే ఉండ‌డంతో పాటు స్టెరాయిడ్ల‌తోనే చికిత్స తీసుకుంటున్నారు. స్టెరాయిడ్ల‌తో చికిత్స చేసుకోవ‌డంతో రిక‌వ‌రీ రేటు కూడా పెరిగింద‌ని అంటున్నారు. డెక్సామెథజోన్ అనే స్టెరాయిడ్ తో మంచి ఫలితాలు వస్తున్నాయని అమెరికా వైద్యులు గుర్తించారు. అయితే ఈ స్టెరాయిడ్ల‌తో ప్ర‌స్తుతానికి క‌రోనా నుంచి కోలుకున్నా భ‌విష్య‌త్తులో మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ రావ‌డంతో పాటు ఆరోగ్యంపై ఖ‌చ్చితంగా ప్ర‌భావం చూపుతాయ‌న్న ఆందోళ‌న‌లు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Leave a comment