స‌రికొత్త రోల్‌లో జ‌బ‌ర్ద‌స్త్ ఫేం ర‌ష్మీ గౌత‌మ్‌… ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య పోతారు..!

తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ సెన్సేష‌న్ ర‌ష్మీ గౌత‌మ్‌..స‌రికొత్త రోల్‌లో క‌నిపించ‌నుంది. గ‌త ప‌దేళ్లుగా ఎంట‌ర్‌టైన్మెంట్ రంగాన్ని ఏలుతున్న ర‌ష్మి తొలి సారిగా స్పోర్ట్స్ షోలో క‌నిపించ‌బోతోంది. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో ప్ర‌సార‌మ‌య్యే గ‌ర్ల్ ప‌వ‌ర్ షోలో ర‌ష్మీ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ షో ఆగ‌స్టు 2 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ , ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో భార‌త మ‌హిళ‌లు స‌త్తా చాటుతున్నారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో ప్రపంచ ఛాంపియన్లుగా వెలుగొందుతున్నారు. వారంద‌రికీ స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు సెల్యూట్ చేస్తూ, ఒక ప్ర‌త్యేక షో ను రూపొందించి వారికి అంకిత‌మిస్తోంది. తెలుగు రాష్ట్రాల‌ మ‌హిళ‌ల క్రీడా ప్ర‌స్థానాన్ని భావిత‌రాల‌కు తెలియ‌జేసి ఎంతోమందిలో స్ఫూర్తి క‌లిగించాల‌ని భావిస్తోంది.

 

అంతర్జాతీయ క్రీడావేదిక‌ల‌పై తెలుగు మహిళల శ‌క్తి సామ‌ర్థ్యాలు, వారు సాధించిన విజ‌యాలను, ..ఎవ‌రికీ సాటిరాని ఘ‌న‌త‌ను ఎలా సాధించార‌నే విష‌యాల‌ను చూపించ‌డ‌మే ఈ షో ముఖ్య ఉద్దేశ్యం. అంకిత భావం, ధృడ నిశ్చ‌యంతో ఆట‌ల్లో వారు ఎంత అత్యుత్త‌మంగా రాణించార‌నేది ఈ షో తెలియ‌జేస్తుంది. ఎక్కువ మంది మ‌హిళ‌లు క్రీడ‌ల్లో కొన‌సాగేలా వారిలో స్ఫూర్తి నింప‌డ‌మే ఈ షో ప్ర‌ధాన ఉద్దేశ్యం. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన తెలుగు రాష్ట్రాల మహిళా అథ్లెట్ల ఇతివృత్తంతో ఈ షో ప్రసారం కానుంది. ర‌ష్మీ త‌న‌దైన శైలిలో ఇంట‌ర్వ్యూ చేసేందుకు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు గ‌ర్ల్ ప‌వ‌ర్ షోను ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ర‌ష్మీ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోలో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ గుత్తా జ్వాలా అతిథులు.

 

మ‌హిళా క్రికెట్ సెన్సేష‌న్ మిథాలీరాజ్‌తో ర‌ష్మీ చేసిన ఇంట‌ర్వ్యూ తొలి ఎపిసోడ్ ఇప్ప‌టికే సిద్ధ‌మైంది. ఆగ‌స్టు 2న ఉద‌యం 10గంట‌ల‌కు స్టార్ స్పోర్ట్స్‌1 తెలుగు ఈ ఎపిసోడ్‌ను టెలికాస్ట్ చేయ‌నుంది. మిథాలీ త‌న క్రికెట్ జ‌ర్నీతో పాటు కాంట్ర‌వ‌ర్సీలు, రిటైర్మెంట్‌పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌ ఇన్నాళ్లు సినిమాలు, ఎంట‌ర్ టైన్మెంట్ చాన‌ల్స్ ద్వారా అల‌రించిన ర‌ష్మీ..స్పోర్ట్స్ స్టార్స్ తో ఎటువంటి హంగామా చేసిందో అనేది ఆడియ‌న్స్‌కు ఇంట్రెస్టింగ్ పాయింట్. చూడండి, ఈ ఆదివారం మిథాలీరాజ్ ర‌ష్మీతో పంచుకుంటున్న త‌న స్టోరీని “ గ‌ర్ల్ ప‌వ‌ర్‌– స‌రిలేరు మ‌న‌కెవ‌రు” ఆగ‌స్టు 2న ఉద‌యం 10 గంట‌ల‌కు కేవ‌లం స్టార్ స్పోర్ట్స్‌1 తెలుగులో ప్ర‌సారం కానుంది.

Leave a comment