విశ్వక్ సేన్ ‘పాగల్’.. యువ హీరో పిచ్చి ప్రేమ చూపిస్తాడా..!

యువ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా హిట్ సినిమాతో హిట్ అందుకోగా తన నెక్స్ట్ సినిమా ఈరోజు ఎనౌన్స్ చేశాడు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేయగా తాజాగా తన లేటెస్ట్ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేశాడు విశ్వక్ సేన్. లక్కీ మీడియా బ్యానర్ లో నరేష్ కుప్పిలి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్ పాగల్ అని నిర్ణయించారు. పాగల్ అంటే తెలుగులో పిచ్చోడు అని అర్ధం.. యువ హీరో విశ్వక్ సేన్ పిచ్చోడిగా కనిపిస్తాడన్నమాట.

సినిమాల సెలక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న విశ్వక్ సేన్ యువ హీరోల్లో మంచి క్రేజ్ తెచ్చుకునేలా ఉన్నాడు ఈనగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్ ఇలా డిఫరెంట్ సినిమాలు చేస్తూ అలరిస్తున్న విశ్వక్ సేన్ టాలీవుడ్ లో తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఏర్పరచుకునేలా ఉన్నాడు. పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విశ్వక్ సేన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడా చూడాలి.