మోతమోగించిన అల వైకుంఠపురములో సాంగ్స్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములోని పాటలు రిలీజ్‌కు ముందే భారీ హిట్‌గా నిలిచాయి. థమన్ ఈ సినిమాకు అందించిన సంగీతం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియాలో ఇప్పటికీ ఈ సాంగ్స్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన ఈ ఆల్బమ్ అందరి మనసులను దోచుకుని దూసుకెళ్తుంది. ముఖ్యంగా హిట్ సాంగ్స్ అయిన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ సాంగ్స్ బాలీవుడ్ హిట్స్‌ని కూడా మైమరిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రంలోని పాటలు అందరి మన్నన పొందుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అల వైకుంఠపురములోని సాంగ్స్‌కి క్రేజ్ రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. థమన్ బెస్ట్ వర్క్స్‌లో ఈ చిత్రం టాప్ ప్లేస్ సంపాదించింది. ఈ సినిమాను త్రివిక్రమ్‌ డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.

Leave a comment