విశ్వక్ సేన్ హిట్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం హిట్ రిలీజ్‌కు ముందే ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకుందో అందరికీ తెలిసిందే. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కడంతో దీన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు.

ఇక ఈ సినిమాకు తొలిరోజే అదిరిపోయే టాక్ రావడంతో పాటు పాజిటివ్ రివ్యూలు కూడా తోడవ్వడంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ చాలా డీసెంట్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా తొలి వీకెండ్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.3.57 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఇది చాలా డీసెంట్ కలెక్షన్లు అని చెప్పాలి.

నాని ప్రొడ్యూస్ చేసిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో అదిరిపోయే ట్విస్టులు ఉండటంతో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా వేరే ఏ సినిమాలు లేకపోవడంతో హిట్ చిత్రానికి బాగా కలిసొచ్చింది. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమా టోటల్ రన్‌లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇక ఏరియాల వారీగా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు
నైజాం – 2.03 కోట్లు
సీడెడ్ – 29.5 లక్షలు
గుంటూరు – 26 లక్షలు
ఉత్తరాంధ్ర – 34.5 లక్షలు
ఈస్ట్ – 15 లక్షలు
వెస్ట్ – 15 లక్షలు
కృష్ణా – 24.5 లక్షలు
నెల్లూరు – 9.5 లక్షలు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు – 3.57 కోట్లు