డైలాగులు లేని బాలయ్య.. కష్టమే అంటోన్న ఫ్యాన్స్!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. పలు కారణాల వల్ల రెగ్యులర్ షూటింగ్ వరుసగా వాయిదా పడుతూ వస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్ చాలా నిరాశకు లోనయ్యారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ఫ్యాక్షనిస్ట్‌గా, అఘోరాగా బాలయ్య మనకు కనిపించనున్నాడట. ఈ సినిమాలో మరో విశేషమేమిటంటే అఘోరా పాత్రలో నటించే బాలయ్యకు ఎలాంటి డైలాగులు లేవని తెలుస్తోంది. అఘోరా బాలయ్య కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మనల్ని ఆకట్టుకుంటాడని, అందుకే ఈ సినిమాలో అఘోరా పాత్ర చాలా కీలకం కానుందని తెలుస్తోంది.

బోయపాటితో ముచ్చటగా మూడోసారి బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు నందమూరి ఫ్యాన్స్‌లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. ఏదేమైనా బాలయ్య అఘోరాగా ఎలా ఉంటాడా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.