తారక్-చరణ్‌లు కలుస్తారా లేదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కలిసి నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో యావత్ భారతదేశం ఈ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తున్నా వారు కలిసి కనబడతారా లేదా అనే అంశం ప్రస్తుతం టాలీవుడ్ హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. వాస్తవానికి వేరు వేరు ప్రాంతాలకు చెందిన వీరిద్దరు కలిసినట్లు చరిత్రలో లేదు. అయితే ఒక సందర్భంలో వీరిద్దరు కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ సమయంలో వీరిద్దరు కలిసి ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే పాయింట్‌ను పట్టుకుని జక్కన్న తారక్-చరణ్‌లను కలిపి చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

ఒకవేళ నిజంగానే తారక్, చరణ్‌లను కలిపి చూపించినట్లయితే ఆ సీన్ ఎలా ఉంటుందా అని అప్పుడే టాలీవుడ్‌లో అంచనాలు వేసుకుంటున్నారు ప్రేక్షకులు. ఏదేమైనా తారక్, చరణ్‌లను కలిసి ఒకేసారి స్క్రీన్‌పై చూస్తే ఆ క్రేజే వేరు అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ ఇద్దరు హీరోలను జక్కన్న నిజంగానే కలుపుతాడా లేదా అనేది చూడాలి. ఇక చరణ్ సరసన ఆలియా భట్, తారక్ సరసన ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.