టక్ జగదీష్‌లో అదే హైలైట్..?

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు నాని రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో తొలిసారి విలన్‌గా నటిస్తున్న నాని, ఇప్పటికే తన నెక్ట్స్ మూవీని కూడా ఓకే చేశాడు. నిన్నుకోరి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన శివ నిర్వాణ డైరెక్షన్‌లో టక్ జగదీష్ అనే టైటిల్‌తో ఓ సినిమా చేసేందుకు నాని రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమాకు వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడట దర్శకుడు. ఈ సినిమాలో నాని చేయబోయే పాత్ర, దాన్ని చూపించే విధానం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ట్విస్టు సినిమాకే హైలైట్‌ కానుందట. ఈ బ్యాంగ్‌లో నాని పాత్ర ఎలా మారుతుందనే అంశాన్ని మనకు చూపించనున్నారు చిత్ర యూనిట్. పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కానుంది.

పెళ్లిచూపులు ఫేం రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్‌లు ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను ఈ ఏడాది చివరికల్లా రిలీజ్ చేసేందుకు నాని ప్లాన్ చేస్తున్నాడు.