పవర్‌ఫుల్ స్టైల్‌లో పుస్తకం చదువుతున్న వీకల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న 26వ చిత్రానికి సంబంధించి గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్‌లకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఫాలో అవుతున్నారు. బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో తొలిసారి లాయర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు్న్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ చేశారు. ఈ సినిమాకు అందరూ అనుకుంటున్నట్లుగానే వకీల్ సాబ్ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్‌గా కాళ్లు చాపుకుని కూర్చుకు పుస్తకం చదువున్న పోజు ఇచ్చాడు. కళ్లకు నల్లటి అద్దాలు పెట్టుకున్న పవన్, కాళ్లకు మాత్రం చెప్పులు వేసుకోలేదు. చాలా స్టైలిష్‌గా ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.