హిట్ 4 డేస్ కలెక్షన్లు.. విశ్వక్ హిట్ కొట్టాడు!

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్ రిలీజ్‌కు ముందే మంచి అంచనాలను క్రియేట్ చేసింది. పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక రిలీజ్ రోజునే ఈ సినిమాకు మంచి టాక్‌తో పాటు పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపారు.

అయితే ఈ సినిమాకు పోటీగా బాక్సాఫీస్ వద్ద మరే ఇతర సినిమాల లేకపోవడంతో ‘హిట్’ సినిమా కలెక్షన్ల పరంగా చాలా డీసెంట్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్‌కు కూడా చేరుకోవడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినమాలో విశ్వక్ సేన్ నటన హైలైట్ కాగా, కంటెంట్‌తో పాటు దర్శకుడి టేకింగ్ కూడా ప్రేక్షకులను మెప్పించింది.

విశ్వక్ మెయిన్‌ లీడ్‌లో నటించిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమా 4 రోజుల్లో రెండు దెలుతు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి

ఏరియా – 4 రోజుల కలెక్షన్లు
నైజాం – 2.19 కోట్లు
సీడెడ్ – 0.31 కోట్లు
నెల్లూరు – 0.09 కోట్లు
కృష్ణా – 0.28 కోట్లు
గుంటూరు – 0.27 కోట్లు
వైజాగ్ – 0.40 కోట్లు
ఈస్ట్ – 0.17 కోట్లు
వెస్ట్ – 0.18 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 3.89 కోట్లు

Leave a comment