రేటు పెంచిన బుట్ట బొమ్మ.. ఒకప్పుడు ఛీ అన్న వాళ్ళే ఇప్పుడిలా..!

ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా మేనియా ఓ రెంజ్ లో నడుస్తుందని చెప్పొచ్చు. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో ఫ్లాప్ హీరోయిన్ ముద్ర వేసుకున్న ఈ అమ్మడు అల్లు అర్జున్ డీజేతో దుమ్ముదులిపేసింది. బికినీ వేస్తేనే కానీ వర్క్ అవుట్ కాదని మూడవ సినిమాకే కనిపెట్టిన పూజా తనలోని హాట్ యాంగిల్ చూపిస్తూ తెలుగు ఆడియెన్స్ ను బుట్టలో వేసుకుంది. కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి లక్కీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది.

హ్రితిక్ రోషన్ తో చేసిన మొహెంజోదారో సినిమా ఫ్లాప్ అవడంతో పూజా హెగ్దేకి అక్కడ ఐరన్ లెగ్ అన్న ముద్ర పెద్దది. అయితే సౌత్ లో వరుస హిట్లు కొడుతుండటంతో అక్కడ కూడా వరుస ఛాన్సులు అందుకుంటుంది. ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతతో ఈ బుట్ట బొమ్మ తన రెమ్యునరేషన్ కూడా పెంచేసిందట. నిన్న మొన్నటి దాకా సినిమాకు కోటిన్నర రెండు కోట్ల మధ్య ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు రెండున్నర నుండి 3 కోట్లు ఇస్తేనే చేస్తా అంటుందట.

పూజా హెగ్దే సినిమాలో ఉంటే గ్లామర్ విషయంలో ఢోకా ఉండదు అందుకే ఆమె అడిగినంత ఇచ్చి అమ్మడిని బుక్ చేసుకుంటున్నారట. మొత్తానికి బుట్ట బొమ్మ ఫామ్ చూసి మిగతా హీరోయిన్స్ ముక్కున ఛీ కొట్టిన బాలీవుడ్ మేకర్స్ కూడా ఆమెను కోట్లు ఇచ్చి మరి సినిమాలు చేస్తున్నారని తెలుస్తుంది.