ప్రభాస్ నా కొడుకు.. అతని కోసం సినిమాలు వదిలేస్తా

స్వీటీ అనుష్క యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరు ఎంత మంచి జోడీని తెలిసిందే. ఆన్ స్క్రీన్ పై వాళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవుతుంది. ఇక ఆప్ స్క్రీన్ లో వీరి ఫ్రెండ్ షిప్ గురించి అందరికి తెలుసు. ఇద్దరికి చాలాసార్లు పెళ్లి కూడా చేశారు. ఎప్పటికప్పుడు మా మధ్య ఏమి లేదని చెబుతున్నా సరే ప్రభాస్ గురించి అనుష్కను, అనుష్క గురించి ప్రభాస్ ను అడిగి విసిగిస్తారు. ప్రస్తుతం అనుష్క నిశ్శబ్దం సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో అనుష్క బుల్లితెర షోల్లో సందడి చేస్తుంది.

ఈ క్రమంలో ఈటివి క్యాష్ షోలో కూడా అనుష్క పాల్గొంది. సుమ హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో ప్రభాస్ ఫోటో చూపించి ఇతని గురించి చెప్పమని అడిగింది సుమ.వెంటనే అనుష్క అతను నా కొడుకు అని చెప్పింది. మహేంద్ర బాహుబలిలా ఫీల్ అయ్యి అనుష్క ఆ డైలాగ్ చెప్పిందన్నమాట. ఇక ప్రభాస్ తో ఫ్రెండ్ షిప్, సినిమా ఛాన్సులు ఈ రెండిటిలో ఒకటి మాత్రమే కావాలి రెండోది వదిలేయాలంటే ఏది వదిలేస్తావ్ అన్న సుమకు ఆన్సర్ గా ప్రభాస్ కోసం సినిమాలు వదిలేస్తా అన్నది అనుష్క.

ఈవారం క్యాష్ షోలో సుమతో పాటుగా నిశ్శబ్దం టీమ్ ఆటపాటలు ఫ్యాన్స్ ను అలరించనున్నాయి. ప్రభాస్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న అనుష్క మీద మళ్ళీ రకరకాల వార్తలు వచ్చేలా ఈ షోలో ఆమె మాట్లాడటం విశేషం.