Gossipsకొత్త అవతారమెత్తిన ఆర్ఎక్స్ పాప

కొత్త అవతారమెత్తిన ఆర్ఎక్స్ పాప

ఆర్ఎక్స్ సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, ఆ తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఆమెకు సరైన హిట్ మాత్రం పడటం లేదు. దీంతో ఈ బ్యూటీ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో పాయల్ పాప ఓ ఇంట్రెస్టింగ్ రోల్‌లో నటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న నరేంద్ర అనే సినిమాలో ఓ పాత్ర కోసం పాయల్ రాజ్‌పుత్‌ను సంప్రదించగా, ఆమెకు తన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పాయల్ ఓ లేడీ పైలట్‌గా కనిపించేందుకు రెడీ అవుతోందట. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ధైర్యవంతురాలిగా ఉండటంతో పాటు ఆ పాత్ర సినిమాలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉండటంతో పాయల్ కూడా వెంటనే ఓకే చెప్పేసిందట.

ఇక రీసెంట్‌గా వెంకీ మామ చిత్రంతో మనముందుకు వచ్చిన పాయల్, తన నటనతో పాటు అందాల ఆరబోతతోనూ అలరించింది. ఆర్ఎక్స్ 100, ఆర్డీఎక్స్ లవ్ వంటి సినిమాల్లో బోల్డ్ పాత్రల్లో నటించి తనదైన ముద్ర వేసుకుంది ఈ బ్యూటీ. మరి పైలట్‌గా మారి ఎలాంటి ఇంప్రెషన్ కొట్టేస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news