టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నా అందులో ఒకటో రెండో సక్సెస్ అవుతూ వస్తున్నాయి. జనవరిలో రిలీజ్ అయిన చిత్రాల్లో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాలు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. అయితే ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న సినిమాల పరిస్థితి దారుణంగా తయారైంది.
ఫిబ్రవరిలో చాలా సినిమాలే రిలీజ్ కానున్నాయి. కానీ వాటిలో వరల్డ్ ఫేమస్ లవర్, జాను, భీష్మ వంటి సినిమాలకు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ సినిమాల్లో కూడా ఒక్క భీష్మ చిత్రం తప్పితే మిగతా రెండు సినిమాలకు పెద్దగా బజ్ లేదని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి భీష్మ సినిమాలో కూడా ఆకట్టుకునే అంశాలు లేకపోతే అది కూడా బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేయడం ఖాయమని అంటున్నారు సినీ వర్గాలు.
మొత్తానికి ఈ నెలలో రాబోయే సినిమాలకు పెద్దగా బజ్ లేకపోవడంతో ప్రేక్షకులు ఏ సినిమా చూస్తారో, ఏ సినిమాను ఆదరిస్తారో తెలియకుండా పోయింది. మరి ఈ నెలలో ఏ సినిమా హిట్ అవుతుందో, ఏది ఫట్ అవుతుందో చూడాలి.