Moviesవరల్డ్ ఫేమస్ లవర ట్రైలర్ టాక్.. ప్రేమతో నింపేశారు

వరల్డ్ ఫేమస్ లవర ట్రైలర్ టాక్.. ప్రేమతో నింపేశారు

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో విజయ్ మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక టీజర్‌లో అర్జున్ రెడ్డి పోలికలు కనిపించడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు.

కాగా ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా లాంఛ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా ట్రైలర్ చూస్తే విజయ్ దేవరకొండకు అదిరిపోయే హిట్ దక్కడం ఖాయమని అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరో తన జీవితంలో ముగ్గురు అమ్మాయిలను వివిధ సమయంలో ప్రేమించడం, వారితో అతడు చసిన రొమాన్స్‌ను మనకు చూపిస్తారు. ఇందులో భార్యపై విజయ్ చూపించే ప్రేమ కూడా ఉంటుంది. ఒక మగాడు తన జీవితంలో నలుగురిని ప్రేమించి ఎలాంటి గుణపాఠం పొందాడనేది చిత్ర కథ.

మొత్తానికి ఈ సినిమాలో ఎదో కొత్త అంశాన్ని దర్శకుడు క్రాంతి మాధవ్ మనకు చూపించనున్నట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా, కేథరిన్ త్రేసా, ఐశ్వర్యా రజేష్, ఇజాబెల్ల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కెఎస్ రామారావు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news