Moviesరాజుగారి బూజు తీస్తున్న రీమేక్ చిత్రాలు

రాజుగారి బూజు తీస్తున్న రీమేక్ చిత్రాలు

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంచుకునే సినిమాలపై ప్రేక్షకులు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంటారు. దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే అందులో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుందని వారు భావిస్తారు. కానీ ఇదంతా ఒకప్పటి వ్యవహారంగా మారింది. గతకొంత కాలంగా దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమాలు చూస్తే, ఆయన ఎంచుకునే సినిమాలు ఆయన ట్రాక్ తప్పినట్లు ఖచ్చితంగా చెప్పగలరు.

గతకొంత కాలంగా దిల్ రాజు వరుసగా రీమేక్ చిత్రాలను తన బ్యానర్‌‌పై రిలీజ్ చేస్తున్నాడు. దీంతో ఆయా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడంలో విఫలమవుతున్నాయి. ఇతర భాషల్లో సూపర్ సక్సెస్ అయిన సినిమాలు కూడా తెలుగులో ఫ్లాపులుగా మిగలడంతో దిల్ రాజు భారీ నష్టాలను చవిచూస్తున్నాడు. దీంతో ఆయన స్ట్రెయిట్ సినిమాలు చేయాలని పలువురు ఆయనకు సూచిస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్‌లో తమిళ సూపర్ హిట్ 96 చిత్రాన్ని ‘జాను’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు.

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష కలిసి నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తెలుగులో శర్వానంద్, సమంత జంటగా రూపొందించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాకు పెద్దగా బజ్ లేకపోవడంతో దిల్ రాజు హైరానా పడుతున్నారు. మరి ఈ రీమేక్ చిత్రం దిల్ రాజుకు ఎలాంటి ఫలితాన్ని మూటగుడుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news