బాలయ్య బాటలో ప్రభాస్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో జాన్ అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందనే విషయాన్ని చిత్ర యూనిట్ రివీల్ చేయడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా తన నెక్ట్స్ మూవీని మహానటి వంటి బ్లాక్‌బస్టర్‌ను తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో చేయడానికి ప్రభాస్ అంగీకరించాడు. దీంతో ఈ కాంబోలో రాబోయే సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో వస్తుందా అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అయితే ఇదొక సూపర్ హీరో కాన్సెప్టు మూవీ అంటూ పలు వార్తలు షికారు చేస్తుండగా, ఈ సినిమా బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 తరహా టైం ట్రావెలింగ్ కాన్సెప్టుతో వస్తుందని మరో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

గతంలో బాలయ్య నటించిన ఆదిత్య 369, సూర్య నటించిన 24 చిత్రాలు టైం ట్రావెలింగ్ కాన్సెప్టుతో తెరకెక్కాయి. అయితే ఈ సినిమాలో కమర్షియల్‌గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోయాయి. కానీ ప్రభాస్‌ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోయే సినిమా వాటి రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇక ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌ ప్రొడ్యూస్ చేస్తుండగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.