Gossipsపవన్ సినిమాలో హాట్ యాంకర్.. ఏం చేస్తుందంటే?

పవన్ సినిమాలో హాట్ యాంకర్.. ఏం చేస్తుందంటే?

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోలో తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఫేం సంపాదించింది అనసూయ భరద్వాజ్. ఈ షో ఇంత సక్సె్స్ కావడంలో అనసూయ అందాల ఆరబోత కూడా పాత్ర పోషించిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. కాగా అనసూయ అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వచ్చినా రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర చేసినందుకు ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఇక అదే స్పీడుతో వరుసబెట్టి సినిమా ఛాన్సులు కూడా కొట్టేసిన ఈ బ్యూటీ ఇప్పుడు మరో అద్భుతమైనా ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీఎంట్రీని అదిరిపోయే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే పింక్ రీమేక్ చిత్రంలో నటిస్తున్న పవన్, ఆ తరువాత క్రిష్ డైరెక్షన్‌లో నటించేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు చిత్ర యూనిట్ అనసూయను సంప్రదించారట. పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ అనగానే అనసూయ కూడా ఎగిరి గంతేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో ఆమె చేయబోయే పాత్ర ఏమిటా అనేది ఆసక్తిగా మారింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనేది కూడా సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే అఫీషియల్‌గా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ అతిత్వరలో స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news