అల కాంబో మళ్లీ రిపీట్ అంటోన్న నిర్మాత

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ కొట్టింది ఈ సినిమా. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.

త్రివిక్రమ్ మార్క్ టేకింగ్‌తో ఈ సినిమా తెరకెక్కడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న బన్నీ, తన నెక్ట్స్ మూవీలను రెడీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసిన బన్నీ, మరో రెండేళ్ల వరకు బిజీగా మారనున్నాడు. అయితే అల వైకుంఠపురములో సినిమాతో భారీ లాభాలను గడించిన చిత్ర నిర్మాతలు, మరోసారి బన్నీ-త్రివిక్రమ్ కాంబో‌ను రిపీట్ చేయాలని భావిస్తున్నారు.

దీని కోసం త్రివిక్రమ్‌ను సంప్రదించగా ఆయన ఓకే అన్నాడట. అయితే బన్నీ ఖాళీ అయిన తరువాతే ఈ ప్రాజెక్ట్ రెడీ అయ్యే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా అల వైకుంఠపురములో సక్సెస్‌తో మరోసారి ఈ కాంబోను రిపీట్ చేయాలనే నిర్మాతల ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Leave a comment