ఆ సినిమాలకు దిక్కూదివానమే లేదట!

సాధారణంగా తెలుగు సినిమాలను ఓవర్సీస్ ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తారు. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే అక్కడి బయ్యర్లకు ఇక పండగనే చెప్పాలి. కలెక్షన్లతో ఓవర్సీస్ బాక్సాఫీస్ తుక్కురేగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలను కొనాలంటే.. కాదు ఆ ఆలోచనకే అక్కడి బయ్యర్లు పారిపోతున్నారట.

నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న రూలర్ సినిమాపై ఇక్కడైతే మంచి అంచనాలే ఉన్నాయి కానీ.. ఓవర్సీస్‌లో పెద్దగా మార్కెట్‌లేని బాలయ్య సినిమాను కొనాలంటే అక్కడి బయ్యర్లు భయపడుతున్నారట. ఇకపోతే అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి బ్లాక్‌బస్టర్ హిట్లు అందించిన విజయ్ దేవరకొండ నటిస్తోన్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు కూడా అక్కడ దిక్కు లేకుండా పోయింది. ఈ సినిమాను కూడా ఓవర్సీస్ బయ్యర్లు కొనాలంటే భయపడుతున్నారట.

మరి ఓవర్సీస్ బయ్యర్లను భయపట్టేంత మేటర్ ఈ సినిమాల్లో ఏముందా అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా తెలుగు ఓవర్సీస్ బయ్యర్లకు గడ్డుకాలం నడుస్తున్న ఈ సమయంలో తమ సొమ్ము పోగొట్టుకోకుండా జాగ్రత్తపడుతున్నారు అక్కడి బయ్యర్లు. మరి ఈ సినిమాలకు ఎవరు దిక్కవుతారో చూడాలి.

Leave a comment