Gossips"సైరా " ఆఫీషియల్ ట్రైల‌ర్ ... మెగాస్టార్ న‌ట విశ్వ‌రూపం...

“సైరా ” ఆఫీషియల్ ట్రైల‌ర్ … మెగాస్టార్ న‌ట విశ్వ‌రూపం అరాచ‌కం..

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది తెలుగు సినిమా అభిమానులే కాకుండా ఇండియ‌న్ సినిమా అభిమానులు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న సైరా ట్రైల‌ర్ ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయ్యింది. ఈ రోజు జ‌ర‌గాల్సిన సైరా ప్రి రిలీజ్ ఈవెంట్ వాయిదా ప‌డడంతో సినిమా యూనిట్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేయకుండా సైరా ట్రైల‌ర్ వ‌దిలారు. సైరా ట్రైల‌ర్ అలా సోష‌ల్ మీడియాలో వ‌దిలారో ? లేదో మెగా అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. కేవలం సోషల్ మీడియాలో ట్రైలర్ లాంచ్ కాకుండా రెండు రాష్రాల్లో దాదాపు 94గా థియేటర్స్ లో ట్రైలర్ ను ప్లే చేస్తున్నారు. ట్రైల‌ర్ వ‌ద‌ల‌డం ఆల‌స్యం సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతూ దూసుకుపోతోంది.

శ్రీమ‌ణి కొణిదెల సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్‌లో చిరు న‌ట‌నా విశ్వ‌రూపం చూపించాడు. టీజ‌ర్లో వాడిన కొన్ని షాట్లు ఇక్క‌డ కూడా రిపీట్ అయిన‌ట్టు ఉన్నాయి. ట్రైల‌ర్ చూస్తుంటే రోమాలు నిక్క‌పొడుచుకుని… క‌ళ్లార‌ప్ప‌కుండా చూసేలా ఉంది. ఈ వ‌య‌స్సులో కూడా చిరు న‌ట‌నా విశ్వ‌రూపం చూపించాడు. మూడు నిమిషాల పాటు ఉన్న ట్రైల‌ర్‌లో ఎక్కువుగా యాక్ష‌న్ క‌ట్సే ఉన్నాయి.

ప్ర‌తి ఒక్క‌రి రోల్ రివీల్ చేయ‌డంతో పాటు ట్రైల‌ర్ అంతా పూర్తి యాక్ష‌న్ మ‌యంతో నింపేశారు. ఓవ‌రాల్‌గా చిరు న‌ట విశ్వ‌రూప‌మే ట్రైల‌ర్‌లో ఉంది. ట్రైల‌ర్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉండ‌డం… విజువ‌ల్స్ మిరుమిట్లు గొల‌ప‌డంతో ప‌దే ప‌దే చూస్తుండ‌డంతో లైకులు, కామెంట్లు, షేర్ల వ‌ర్షం కురిపించేస్తున్నారు. ఈ దూకుడు చూస్తుంటే సైరా ట్రైల‌ర్ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news