Movies" గద్దలకొండ గణేష్ " మూవీ రివ్యూ అండ్ రేటింగ్

” గద్దలకొండ గణేష్ ” మూవీ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: గద్దలకొండ గణేష్
నటీనటులు: వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అథర్వ తదితరులు
సినిమాటోగ్రఫీ: అయనంక బోస్
సంగీతం: మిక్కీ జే మేయర్
నిర్మాణం: 14 రీల్స్ ప్లస్
దర్శకత్వం: హరీష్ శంకర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి మొదట్నుండీ మంచి అంచనాలను క్రియేట్ చేసింది. వరుణ్ మేకోవర్ ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా మారడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఆతృతగా చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక అందాల భామ పూజా హెగ్డే మరోసారి వరుణ్‌తో జోడి కట్టడంతో వారి కాంబినేషన్‌ ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు ఆమె ఫ్యాన్స్. చివరి నిమిషంలో గద్దలకొండ గణేష్‌గా పేరు మార్చుకుని శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ:
సినిమా డైరెక్టర్ కావాలని ఎంతగానో ప్రయత్నిస్తుంటాడు బాలమురళి రామ(అథర్వ). అతడికి డైరెక్టర్‌గా ఛాన్సులు రాకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో అతడి ఇంట్లోవారితో తాను ఎప్పటికైనా ఓ సినిమాను డైరెక్ట్ చేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. కట్ చేస్తే.. గద్దలకొండ గణేష్ అనే రౌడీ గురించిన సమాచారం సేకరించి, అతడితో సినిమా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు రామ. ఈ క్రమంలో గణి గద్దలకొండ గణేష్‌గా ఎందుకు మారాడనే విషయం తెలుసుకుంటాడు రామ. శ్రీదేవి(పూజా హెగ్డే) అంటే గణికి చాలా ఇష్టం. ఎట్టకేలకు సినిమా షూటింగ్ మొదలుపెట్టిన రామ ఆ సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తాడా..? గద్దలకొండ గణేష్‌గా గణి ఎందుకు మారాడు..? చివరకు అతడు ఎలాంటి వ్యక్తిగా మిగులుతాడు..? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
ఇప్పటివరకు మాస్ సబ్జెక్టును టచ్ చేయని వరుణ్ తేజ్, తొలిసారి ఫుల్ ఫ్లెడ్జ్ మాస్ పాత్రలో నటించాడు. వరుణ్ మేకోవర్‌ ఈ సినిమాకే హైలైట్‌‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వచ్చింది. ఇక నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఫస్టాఫ్‌లో సినిమా డైరెక్టర్‌గా ప్రయత్నించే అథర్వ తన కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా డైరెక్టర్‌గా మారుతానని ఛాలెంజ్ చేస్తాడు. ఈ క్రమంలో గద్దలకొండ గణేష్ అనే రౌడీ అయితే తన సినిమాలో హీరోగా పర్ఫెక్ట్‌గా సరిపోతాడని అథర్వ నిర్ణయించుకుంటాడు. ఇదే సమయంలో అతడు గణి నుండి గద్దలకొండ గణేష్‌గా ఎందుకు మారాడనే విషయం తెలుసుకుంటాడు అథర్వ.

అయితే గద్దలకొండ గణేష్‌ గ్యాంగ్‌లోని తుపాకి రాజు అథర్వకు సహాయం చేస్తుంటాడు. గణేష్‌ను అథర్వ సినిమాలో నటించేటట్లు ఒప్పించేందుకు అతడు సహాయం చేస్తుంటాడు. గణేష్‌ నటించేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో గణి ఫ్లాష్‌బ్యాక్‌‌లో శ్రీదేవిపై ప్రేమను మనకు చూపించాడు దర్శకుడు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో వచ్చే ఫైట్ సీన్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇక సెకండాఫ్‌లో గణితో సినిమాను మొదలుపెడతాడు అథర్వ. అయితే అతడికి కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో సినిమాను కొనసాగిస్తాడా లేడా అనే సందేహం వస్తుంది. ఇక ఎలాగోలా సినిమాను పూర్తి చేస్తాడు అథర్వ. క్లైమాక్స్‌లో గణేష్ ఎలా మారుతాడు అనే నోట్‌తో శుభం కార్డు పడుతుంది.

ఓవరాల్‌గా గద్దలకొండ గణేష్ సినిమా మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. క్లాస్ ప్రేక్షకులను అలరించే అంశాలు కూడా సినిమాలో ఉండటంతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్:
ఈ సినిమాకు పెద్ద అసెట్ వరుణ్ తేజ్ నటన అని చెప్పాలి. గద్దలకొండ గణేష్ అనే పాత్రలో వరుణ్ పూర్తిగా ఒదిగిపోయాడు. అతడు పండించిన హావభావాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా డైరెక్టర్ కావాలనుకునే పాత్రలో అథర్వ యాక్టింగ్ బాగుంది. సినిమాలో మేజర్ పార్ట్‌లో అతడు నటించి మెప్పించాడు. ఇక పల్లెటూరు అమ్మాయి పాత్రలో పూజా హెగ్డే బాగా నటించింది. మిగతా నటీనటులు వారి పాత్రల మేర బాగా నటించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
తమిళంలో సూపర్ సక్సెస్ సాధించిన జిగర్తండా సినిమాను తెలుగులో గద్దలకొండ గణేష్(వాల్మీకి)గా దర్శకుడు హరీష్ శంకర్ రీమేక్ చేశాడు. రీమేక్ సినిమా అయినప్పటికీ తెలుగు నేటివిటీని ఎక్కడా మిస్ కాకుండా హరీష్ చాలా జాగ్రత్త తీసుకున్నాడు. ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో హరీష్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాను బాగా కలిసొచ్చింది. ప్రతి సీన్‌లో ప్రేక్షకులు లీనమయ్యేలా చేస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు మరో అసెట్. ముఖ్యంగా దేవత సినిమాలోని ‘‘ఎల్లువచ్చి గోదారమ్మ…’’ సాంగ్ వచ్చినప్పుడు ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
గద్దలకొండ గణేష్ – వరుణ్‌ తేజ్ విశ్వరూపం

రేటింగ్:
3.0/5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news