Gossipsమూడుతో ముగించేస్తున్న జక్కన్న

మూడుతో ముగించేస్తున్న జక్కన్న

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం RRR కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తారక్, చరణ్ పాత్రలపై ఇండస్ట్రీలో పలు పుకార్లు వినిపిస్తుండగా.. వాటికి రాజమౌళి చెక్ పెట్టాడు. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్ర చేస్తుండగా.. చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో జక్కన్న ఓ గట్టి నిర్ణయం తీసుకున్నాడట.

RRR సినిమాలో జక్కన్న పాటలకు పెద్ద ఇంపార్టెన్స్‌ ఇవ్వడం లేదని తెలుస్తోంది. రాజమౌళికి కలిసొచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో పాటలకు పెద్ద స్కోప్ లేకపోవడంతో కేవలం 3 పాటలతోనే కానిచ్చేస్తున్నాడు. దీంతో రాజమౌళి సినిమాలలో లాగా ఈ సినిమాలో పాటలు ఉండకపోవచ్చని చిత్ర యూనిట్ తెలిపింది.

తమ ఫెవరెట్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాలో పాటల కోసం ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది కాస్త నిరాశ పరిచే వార్త అని చెప్పాలి. మరి ఆ మూడు పాటలతో రాజమౌళి ఎలాంటి రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడా అని అభిమానులు ఆశగా చూస్తున్నారు.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news