బాహుబలి బాటలో మహేష్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

బాహుబలి సీరీస్ చిత్రాలు ప్యాన్ ఇండియా మూవీల మార్కెట్‌కు టాలీవుడ్‌లో జీవం పోశాయి. ఆ సినిమాలు సాధించిన విజయాలే దానికి నిదర్శనం అని చెప్పాలి. ఇక ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో వరుసగా తెలుగులో ప్యాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే సాహో చిత్రంతో ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీని అందించగా ఇప్పుడు సైరా అంటూ మెగాస్టార్ చిరంజీవి కూడా అదే బాటలో వస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే త్వరలో మహేష్ బాబు కూడా ఇదే బాటలో పయనిస్తాడట.

మహర్షి సినిమా తరువాత మహేష్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా ఆ దర్శకుడు కేజీఎఫ్ లాగా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. దీని కోసం మహేష్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయే ఓ స్టోరీలైన్‌ను రాసుకున్నాడట. ఈ సినిమా గనక పట్టాలెక్కితే మహేష్ బాబు కూడా ప్యాన్ ఇండియా మూవీలో నటించి ఇండియన్ స్టార్ అయిపోతాడని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

ఇక ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా ఆశగా చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు కుదిరి మహేష్ కూడా ఇండియన్ స్టార్ అయిపోవాలని వారు కోరుతున్నారు. మరి మహేష్ ప్యాన్ ఇండియా మూవీ జర్నీ ఎటు వెళ్తుందో చూడాలంటే ఆ సినిమా అనౌన్స్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Leave a comment