చిరు – కొర‌టాల హీరోయిన్‌గా ముదురు ముద్దుగుమ్మేనా..!

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. గాంధీ జయంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఏకంగా ఐదు భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంట‌నే చిరు త‌న 152వ సినిమాను కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మొద‌లు పెట్టేయ‌నున్నాడు. ఇక కొర‌టాల గ‌త సంవ‌త్స‌ర కాలంగా చిరు సినిమా కోసం వ‌ర్క్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొరటాల శివ భరత్ అనే నేను తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చిరు 152 చిత్రంను చేయబోతున్నాడు.

ఇక ఈ సినిమా కోసం కొర‌టాల చిరు ప‌క్క‌న న‌టించే హీరోయిన్‌తో పాటు లొకేష‌న్ల వేట‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో చిరు ప‌క్క‌న న‌టించే హీరోయిన్ అంటూ ప‌లువురి పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. చిరు సైరాలో న‌టించిన‌ నయనతార.. కాజల్.. హ్యూమ ఖురేషి.. తమన్నాల పేర్లు ప్రచారం జరిగాయి. కాని ఈసారి కొత్తగా త్రిష పేరు కూడా ప్రచారం జరుగుతోంది. కొర‌టాల ఈ ప్రాజెక్టు విష‌య‌మై త్రిష‌ను క‌లిసి క‌థ వినిపించిన‌ట్టు తెలుస్తోంది.

కొన్నేళ్లుగా త్రిష తెలుగు ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటోంది. ఆమె గ‌తంలో చిరు ప‌క్క‌న స్టాలిన్ సినిమాలో న‌టించింది. ఇక గ‌త కొన్నేళ్లుగా ఓ స్టార్ హీరోతో ఛాన్స్ కోసం త్రిష క‌ళ్లుకాయ‌లు కాచేలా వెయిట్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె కొర‌టాల చెప్పిన క‌థ విన్నాక చిరు ప‌క్క‌న న‌టించేందుకు ఆస‌క్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో త్రిష న‌టిస్తే 2006 స్టాలిన్ త‌ర్వాత అంటే… 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కలయికలో సినిమా వ‌చ్చిన‌ట్ల‌వుతుంది. ఇక త్రిషకు ఇప్ప‌టికే మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు దాటేసింది. ముదురు ముద్దుగుమ్మ‌గా ఉన్న ఈ అమ్మ‌డికి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చిరుతో ఆఫ‌ర్ అంటే మామూలు విష‌యం కాదు.

Leave a comment