ఆ స్టార్ హీరో కావాలంటోన్న ర‌ష్మిక

నాగ‌శౌర్య హీరోగా తెర‌కెక్కిన ఛలో సినిమాతో టాలీవూడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మంద‌న్నా. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి.. రెండవ చిత్రం గీతగోవిందంతో ఏకంగా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యాక అస‌లు తెలుగులో ఈ అమ్మ‌డికి చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే ఈ ఆఫ‌ర్లును చాలా సెల‌క్టివ్‌గా ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళుతోంది.

ర‌ష్మిక ప్ర‌స్తుతం తెలుగులో మ‌హేష్‌బాబుతో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో పాటు బ‌న్నీతో మ‌రో సినిమా చేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోల‌కు బెస్ట్ ఆప్ష‌న్‌గా మారిన ఈ అమ్మ‌డు ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న కార్తీ నటించిన ‘సుల్తాన్’ చిత్రంతో అటు తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇక విజ‌య్ 64లోనూ ఆమే హీరోయిన్‌.

ఇలా వ‌రుస పెట్టి ఇటు తెలుగుతో పాటు అటు త‌మిళ్‌లో స్టార్ హీరోల‌తో న‌టిస్తోన్న ఈ అమ్మ‌డికి ఓ స్టార్ హీరోతో సినిమా చేయాల‌న్న కోరిక ఉంద‌ట‌. ఆ స్టార్ హీరో కోలీవుడ్ హీరో కావ‌డం విశేషం. ర‌ష్మిక‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమిళ్ స్టార్ హీరో అజిత్‌ సరసన తాను హీరోయిన్ గా చేయాలని, ఆయనతో స్క్రీన్ రొమాన్స్ చేయడానికి తానూ ఎప్పటికీ ఇష్టపడతానని తెలిపింది. మ‌రి ర‌ష్మిక కోరిక‌ను అజిత్ ఎప్ప‌ట‌కీ తీరుస్తాడో ? చూడాలి.

Leave a comment