బిగ్‌బాస్‌3: ఈ వారం ఎలిమినేష‌న్ ఎవ‌రో తేలిపోయిందా…

తెలుగు బుల్లితెరపై ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోన్న బిగ్‌బాస్ 3 సీజ‌న్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు ఆప‌సోపాలు ప‌డుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రేటింగులు లేక ప్రేక్ష‌కుల‌ను విసిగెత్తిస్తోన్న బిగ్‌బాస్‌కు ఎట్ట‌కేల‌కు ప్రీ క్లైమాక్స్ స్టేజ్‌కు చేరుకుంటోన్న వేళ కాస్త ఊపు వ‌చ్చింది. ప్ర‌స్తుతం బిగ్‌బాస్ విజ‌య‌వంతంగా 10 వారాలు కంప్లీట్ చేసుకుని 11వ వారంలోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఇక ఇప్పటికే, వరుణ్ మరియు రాహుల్ మధ్య ఇక హౌస్ నుంచి ఇప్ప‌టికే ఎలిమినేట్ అయిన ఆలీ రెజా తిరిగి హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డంతో హౌస్‌కు కొత్త ఉత్సాహం కొట్టొచ్చిన‌ట్టు క‌న‌ప‌డుతోంది.

ఇక గ‌త వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ అంటూ ట్విస్ట్ ఇచ్చిన విషయాలు వేడెక్కుతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు జంట‌లుగా ఉన్న వ‌రుణ్ – వితిక‌, రాహుల్ – పున‌ర్న‌వి జోడీ ఇప్పుడు విడిపోయారు. ఈ రెండు జంట‌లు వేర్వేరుగా మాట్లాడుకుంటున్నాయి. బిగ్‌బాస్ రాహుల్‌ను ఎలిమినేట్ చేసి అదంతా ఫేక్ ఎలిమినేష‌న్ అని షాక్ ఇచ్చాడు. ఇక హిమ‌జ గ‌త వారం ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారం ఎవ‌రు ? ఎలిమినేట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిగా ఉంది. ఈ విష‌యం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

ఈ వారం ఎలిమినేష‌న్లో శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, రవిలు నామినేట్ అయ్యారు. వీరిలో శ్రీముఖి కెప్టెన్ కావ‌డంతో ఆమె ఎలిమినేట్ కాదు. ఇక వ‌రుణ్‌సందేశ్‌కు హీరో ఇమేజ్ ఉంది. ఇక బాబా భాస్క‌ర్‌కు మంచి ఇమేజ్ ఉండడంతో ర‌వితో పోలిస్తే త‌క్కువ ఓట్లే వ‌చ్చాయంటున్నారు. ఇక మిగిలింది టీవీ న‌టుడు ర‌వి. ఆలీ రెజా ఉన్న‌ప్పుడు అత‌డితో క‌లిసి చాలా సార్లు ఎస్కేపింగ్ గేమ్ ఆడిన ర‌వి ఇప్పుడు వీక్ అయ్యాడు.

ఇక బిగ్‌బాస్ ఓటింగ్‌తో పాటు బ‌య‌ట ప‌లు సంస్థ‌లు సోష‌ల్ మీడియాలో పెట్టిన పోలింగ్‌లో సైతం ర‌వికే ఎక్కువ ఓట్లు వ‌చ్చాయి. దీంతో ర‌వి ఎలిమినేట్ కాక త‌ప్ప‌ద‌నే అంటున్నారు. ర‌వి బెస్ట్ ఫ్రెండ్ ఆలీ రెజా తిరిగి ఇంట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన వెంట‌నే ర‌వి వెళ్లిపోతుండ‌డం ట్విస్టే. ఇక మ‌రి ఈ అంచ‌నాలు ఎలా ? ఉన్నా ఆదివారం ఎవ‌రు ? ఎలిమినేట్ అవుతారో ? తేలిపోనుంది.

Leave a comment