రు.50 వేల‌కు స‌న్నీలియోన్‌ను బుక్ చేసుకున్న కోతులు (వీడియో)

రూ.50వేలకు సన్నీలియోన్ ని బుక్ చేసిన కోతులు..! ఔను ఇది నిజమే. విన‌డానికి కాస్త ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది ? ఎవ‌రా కోతిగాళ్లు అనుకుంటున్నారా ? వాళ్లు నిజంగా బుల్లితెర మీద నానా హంగామా చేసే కోతి గ్యాంగే. జబర్ధస్త్ కమెడియన్లు ఇటీవల పెద్ద తెరపైనా అవకాశాలు అందుకుంటున్నారు. షకలక శంకర్.. చమ్మక్ చంద్ర లాంటి కమెడియన్లు జబర్దస్త్ లో ఫేమస్ అయ్యి తర్వాత హీరోలయ్యారు.

ఇక సుడిగాలి సుధీర్ సైతం ఇప్పుడు ఈ లిస్టులోకే చేరిపోయాడు. త‌న కొలీగ్స్ ఆటో రాంప్రసాద్- గెటప్ శ్రీనులతో కలిసి సుధీర్ చేస్తున్న తాజా సినిమా `3 మంకీస్`. అనిల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా టైటిల్‌కు న్యాయం చేస్తున్న‌ట్టుగానే వీళ్ల ముగ్గురు బ్యాచిల‌ర్ పార్టీలు చేసుకోవ‌డం… అమ్మాయిని బుక్ చేసుకుని రూమ్ కి రప్పించడం టీజర్ లో ఫన్నీగా ఆకట్టుకుంది.

ఇంత‌కు వీళ్లు రూమ్‌కు తెచ్చుకున్న ఆ అమ్మాయి ఎవ‌రో కాదు స‌న్నీలియోన్‌. ప్చ్.. సన్నీలియోన్ అనుకుని పిలిచారు. పైగా రూ.50 వేలు చెల్లించారు మరి. ఇక సన్నీలియోన్ దెబ్బకు ఆ ముగ్గురికి ఏమైంది? అన్నదే ట్రైలర్ చివరిలో ట్విస్టు. టైటిల్‌కు త‌గ్గ‌ట్టుగానే వీరు ముగ్గురు కోతి చేష్ట‌ల‌తో రెచ్చిపోయార‌న్న‌ది తెలిసిపోతోంది. ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓవ‌రాల్‌గా కామెడీ జాన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో ఇంత‌కు మించి మ్యాట‌ర్ ఉందా ? లేదా ? అన్న‌ది సినిమా రిలీజ్ అయ్యాక కాని తెలియ‌దు.

Leave a comment