సరిలేరు నీకెవ్వరు.. ఇంట్రోతో ఇరగదీసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ పాట్రియాటిక్ మూవీలో మహేష్ ఇంట్రొడక్షన్‌ను తెలిపేలా ఓ ఇంట్రో టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ వదిలింది. ఈ టీజర్ చూస్తుంటే మహేష్ ఫ్యాన్స్‌కు తమ అభిమాన హీరో బర్త్ డే ట్రీట్ మామూలుగా లేదు అనేలా ఉంది.

దేశాన్ని కాపాడే సైనికుడిగా మేజర్ పాత్రలో మహేష్ మనకు కనిపించాడు. అతడి అల్ట్రా స్టైలిష్ లుక్‌తో జనానికి పిచ్చెక్కించాడు. బ్యాగ్రౌండ్‌లో వచ్చే సరిలేరు నీకెవ్వరూ అనే కోరస్ సాంగ్ ఆ టీజర్‌కు పర్ఫె్క్ట్‌గా సెట్ కావడంతో మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చాయి. ఇక ఈ టీజర్‌తో మహేష్ అప్పుడే సెన్సేషన్‌లకు తెరలేపాడు. దర్శకుడు అనిల్ రావిపూడి మొదట్నుండీ చెబుతున్నట్లుగానే ఈ సినిమాలో మహేష్ లుక్‌తో పిచ్చెక్కించాడు.

మొత్తానికి ఈ టీజర్‌తో మహేష్ బాబు తన బర్త్‌డే కానుకను రికార్డులు బద్దలుకొట్టేందుకు వదిలాడు. ఇక సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. మొత్తానికి మరో బంబాట్ బ్లాక్‌బస్టర్ మహేష్ ఖాతాలో చేరడానికి రెడీగా ఉందని ఈ ఇంట్రో టీజర్ చూస్తే ఎవ్వరైనా చెప్పగలరు.

Leave a comment