‘ రాక్ష‌సుడు ‘ హిట్‌కొట్టినా సీన్ రివ‌ర్స్‌..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్ కొట్టాడు అన్న ఆనందం ఎక్కువ సేపు నిల‌వ‌లేదు. కోలీవుడ్‌లో హిట్ అయిన రట్సాసన్ సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన రాక్ష‌సుడు సినిమాకు హిట్ టాక్ వ‌చ్చినా తొలి మూడు రోజుల‌కే సినిమా తేలిపోయింది. ఫ‌స్ట్ వీకెండ్ అలా అయ్యిందో లేదో క‌లెక్ష‌న్స్ ఒక్క‌సారిగా డ్రాప్ అయిపోయాయి. రివ్యూల నుంచి సోష‌ల్ మీడియా వ‌ర‌కు అంతా పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయినా వ‌సూళ్లు లేక‌పోవ‌డం మాత్రం దారుణ‌మే.

ఈ సినిమా ఒరిజిన‌ల్ వెర్ష‌న్ రట్సాసన్ గత ఏడాది అక్టోబర్ 5న విడుదలైంది. ఇంకో రెండు నెలలు దాటితే ఏడాది పూర్తి చేసుకుంటుంది. రిలీజైన కొద్దిరోజులకే బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోయింది. ఇక ఈ సినిమాను హైద‌రాబాద్‌లో కూడా రిలీజ్ కాకుండా చూసుకున్నారు. అక్క‌డ త‌మిళ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ సినిమాను రీమేక్ చేయాల‌న్న ఉద్దేశంతో ఇక్క‌డ రిలీజ్ కానివ్వ‌లేదు.

ర‌మేష్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు హిట్ టాక్ సొంతం చేసుకుంది. రూ.17 కోట్ల వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా చేసింది. అయితే ఈ సినిమాపై తెలుగు వాళ్ల‌కు ఆస‌క్తి ఉన్నా ఇప్ప‌టికే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌లో ప‌లుసార్లు చూసేశారు. అక్క‌డ సినిమాను ఇక్క‌డ మక్కీకి మ‌క్కీ దించేయ‌డంతో చాలా మంది ఇక్క‌డ చూసేందుకు ఇష్ట‌ప‌డ‌లేద‌ని క‌లెక్ష‌న్లు చెపుతున్నాయి.

సినిమా రీమేక్ విష‌యంలో చాలా సందేహాలే న‌డిచాయి. ముందు నితిన్ తో తీస్తారని ఓసారి లేదు ఇంకో యూత్ హీరో ఆసక్తి చూపారని మరోసారి ఇలా చేతులు మారుతూ వచ్చి ఆఖరికి సాయి శ్రీనివాస్ దగ్గరికి వచ్చింది. అయినా కుడా దాని ఫలాలు పూర్తిగా అందకపోవడం విచారకరం

Leave a comment