రణరంగం సెన్సార్ రిపోర్ట్

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రణరంగం’ మొదట్నుండీ మంచి బజ్‌ను క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్లకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఆశగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా కంప్లీ్ట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.

ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ ఓరియెంటెడ్ సినిమాలో శర్వానంద్ ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో శర్వానంద్ యాక్టింగ్ పీక్స్ అని అంటున్నారు చిత్ర యూనిట్. శర్వా సినిమాల్లో ప్రస్థానం చిత్రంలో ఉన్న ఇంటెన్సిటీ కంటే ఎక్కువ ఈ సినిమాలో ఉందని చెబుతున్నారు చిత్ర యూనిట్. ఇక శర్వా యాక్టింగ్‌తో ఈ సినిమా మరో లెవెల్‌కు వెళ్లిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాను చూసి శర్వా అండ్ యూనిట్‌ను అభినందించారట. కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు.

పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగష్టు 15న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Leave a comment