” కొబ్బరిమట్ట ” ట్రైలర్.. సంపూ మరో కళా ఖండం..!

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా రూపక్ రొనాల్డ్ సన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కొబ్బరిమట్ట. కొన్నాళ్లుగా రిలీజ్ సంక్షోభంలో ఉన్న ఈ మూవీ ఫైనల్ గా ఆగష్టు 10న రిలీజ్ ఫిక్స్ చేశారు. పాపా రాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడు ఇలా మూడు పాత్రల్లో సంపూర్ణేష్ బాబు నటిస్తున్నాడు. సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా మూడున్నర నిమిషాల కంటిన్యూస్ డైలాగ్ ప్రేక్షకులను అలరించింది.

ఇక లేటెస్ట్ గా కొబ్బరిమట్ట ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మూడు నిమిషాల ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో సంపూ పర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలిచేలా ఉంది. అంతేకాదు సినిమా ట్రైలర్ చూస్తే ఈ దశాబ్ధ కాలంలో ఇలాంటి ట్రైలర్ మరోటి రాలేదని చెప్పొచ్చు. ఆడియెన్స్ కు కామెడీని పంచడమే తన ధ్యేయంగా సంపూర్ణేష్ చేస్తున్న ఈ ప్రయత్నం తప్పకుండా మళ్లీ సక్సెస్ అందుకునేలా ఉంది.

తన మీద ఎలాంటి సెటైర్ వచ్చినా సరే దాన్ని పాజిటివ్ గా తీసుకునే సంపూర్ణేష్ బాబు నాగార్జున మన్మథుడు 2కి పోటీగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాడు. మరి సంపూ కొబ్బరిమట్ట సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Leave a comment