‘ మ‌న్మ‌థుడు 2 ‘ బిజినెస్ ఈ రేంజ్‌లోనా…

టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం మ‌న్మ‌థుడు 2. ఎప్పుడో 2002లో వ‌చ్చిన మ‌న్మ‌థుడు సినిమాను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని నటించిన మ‌న్మ‌థుడు 2. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌(జెమిని కిర‌ణ్‌) నిర్మిస్తున్న ఈ చిత్రం రేపు శుక్ర‌వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు పోటీగా శుక్ర‌వార‌మే విశాల్ టెంప‌ర్ రీమేక్ అయోగ్య‌, అన‌సూయ సినిమాతో పాటు క‌న్న‌డ మ‌హాభార‌త సినిమాలు కూడా వ‌స్తున్నాయి. మ‌న్మ‌థుడు లాంటి రొమాంటిక్ స్టోరీకి కొన‌సాగింపుగా మ‌ళ్లీ అదే స్టైల్ రొమాంటిక్ ట‌చ్ స్టోరీతో వ‌స్తోన్న ఈ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించడం..కీర్తి సురేష్ , సమంత ముఖ్య పాత్రల్లో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ అన్ని ఏరియాల రైట్స్ మంచి ధర పలికాయి.

ఓవ‌రాల్‌గా మ‌న్మ‌థుడు 2 థియేట్రిక‌ల్ రైట్స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.24 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కర్ణాటక రైట్స్ ను కోటి రూపాయిలకు అమ్ముడుపోగా.. సీడెడ్ రైట్స్ కూడా 1.5 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. `RX100` ఫేమ్ చైత‌న్య భ‌ర‌ద్వాజ్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మ‌రి మ‌న్మ‌థుడు 2 రిజ‌ల్ట్ ఏంట‌నేది రేపు తేలిపోనుంది.

Leave a comment