బ్యూటీతో ఆంటీ రొమాన్స్.. ఏకంగా లిప్‌లాక్‌!

కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం మన్మధుడు2 నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో నాగార్జున మరోసారి బ్లాక్‌బస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా ఈ సినిమాలో కింగ్ నాగార్జున-రకుల్‌ల మధ్య అదిరిపోయే లిప్‌లాక్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఎవ్వరికీ తెలియని విషయమేమిటంటే.. ఈ సినిమాలో కేవలం హీరో హీరోయిన్ల మధ్యే లిప్‌లాక్‌లు లేవు. అందాల బ్యూటీతో ఓ ఆంటీ కూడా లిప్ లాక్ చేసిన సీన్ ఈ సినిమాలో ఉంది.

రకుల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఓ సీన్‌లో సీనియర్ నటి, యాంకర్ ఝాన్సీతో ఇద్దరి మధ్య ఘాటైన లిప్‌లాక్ సీన్ ఒక్కటి మనకు కనిపిస్తుంది. అయితే ఈ సీన్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం సెన్సార్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఓవర్సీస్ స్క్రీన్లపై ఈ సీన్‌ను ప్రేక్షకులు చూసి షాక్‌కు గురయ్యారు. స్టార్ బ్యూటీ రకుల్‌, ఝాన్సీల మధ్య వచ్చే ఈ సీన్‌ను వారు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు.

దీంతో ఈ సీన్‌పై కొన్ని కామెంట్లు చేస్తున్నారు సినీ క్రిటిక్స్. లేటు వయసు ఆంటోతో బ్యూటీ లిప్ లాక్ ఏమిటని పెదవి విరుస్తున్నారు. పక్కా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఇలాంటి సీన్స్ ఉంటే ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు ఎలా వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఆ ఒక్క లిప్‌లాక్ సీన్‌తో రచ్చ రంబోలా చేయాలిన చూశారు మన్మధుడు 2 టీమ్.

Leave a comment