నాగార్జున కాంట్ర‌వ‌ర్సీ కూడా ప్ర‌మోష‌న్ ప్లానేనా…?

టాలీవుడ్ కింగ్ నాగార్జున వివాదాలకు చాల దూరంగా ఉంటారని..తనపై లేదా త‌న ఫ్యామిలీపై ఎలాంటి వివాదాలు, మ‌ర‌క‌లు లేకుండా దూరంగా ఉంటుంటాడ‌న్న టాక్ ఉంది. ఇక అఖిల్ పెళ్లి విష‌యంలోనే అక్కినేని ఫ్యామిలీ పేరు పెద్ద ర‌చ్చ ర‌చ్చ అయ్యింది. ఆ విష‌యం ప‌క్క‌న పెట్టేస్తే నాగార్జున ఇప్పుడు త‌న తాజా చిత్రం మ‌న్మ‌థుడు 2 ప్ర‌మోష‌న్ల‌తో పాటు అటు బిగ్‌బాస్ 3కు హోస్ట్‌గా వార్త‌ల్లో బాగా పాపుల‌ర్ అవుతున్నాడు.

నాగార్జున న‌టించిన మ‌న్మ‌థుడు 2 ఈ నెల 9న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో నాగ్ మాట్లాడుతూ ఓ అగ్ర ద‌ర్శ‌కుడితో త‌న‌కు ఉన్న గ్యాప్‌ను ప‌రోక్షంగా బ‌య‌ట పెట్టాడా ? అని ఇండ‌స్ట్రీలో చ‌ర్చించుకుంటున్నారు. న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రి రిలీజ్ ఈవెంట్లో నాగార్జున మ‌న్మ‌థుడు సినిమా గురించి బాగా మాట్లాడాడు.

2002లో వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. నాగ్ తాజా ఈవెంట్‌లో ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమాకు ప‌నిచేసిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్‌, డైరెక్ట‌ర్ కె.విజ‌య్ భాస్క‌ర్‌ను బాగా పొగిడేశాడు. అయితే త‌న మాట‌లు, స్క్రీన్ ప్లేతో ఆక‌ట్టుకున్న త్రివిక్ర‌మ్ గురించి ఎక్క‌డా మాట్లాడ‌లేదు. ఇది త్రివిక్ర‌మ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది.

ఇది అనుకోకుండా జరిగిందా.. లేదంటే కావాలనే త్రివిక్రమ్ పేరు నాగార్జున చెప్పలేదా ? అన్న‌ది నాగ్‌కు తెలియాలి. కొంద‌రు మాత్రం ఈ కాంట్ర‌వ‌ర్సీలు రైజ్ చేస్తేనే సినిమాకు హైప్ వ‌స్తుంద‌ని… ప్ర‌మోష‌న్ గేమ్‌లో అలా చేశాడంటున్నారు. అయితే అప్ప‌ట్లోనే ఈ సినిమా కోసం ప‌నిచేసిన త్రివిక్ర‌మ్‌కు నాగార్జున అనుకున్న రెమ్యున‌రేష‌న్ కంటే ఎక్కువుగా రూ.కోటి ఇచ్చాడ‌న్న టాక్ ఉంది.

Leave a comment