దుబాయ్ వెళుతున్న సాహో టీం…!

యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ నటించిన సాహో టీం దుబాయ్ బాట పట్టనున్నారా..? సినిమాకు గుమ్మడి కాయ కొట్టాక దుబాయ్కు ఎందుకు వెళుతున్నట్లు…? సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతుండగానే సాహో టీం దుబాయ్ బాట ఎందుకు పడుతున్నట్లు అన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా సాహో చిత్ర యూనిట్ తెలిపిన వివరాల మేరకు…

సాహో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఇప్పుడు సాహో టీం పోస్టు ప్రోడక్షన్ పనులతో బిజిగా ఉంటూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రమోషన్తో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న సాహో టీం ముందు ముందు మరింత దూకుడుగా ప్రమోషన్ చేయాలని సంకల్పించింది.

ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే దుమ్ములేపుతున్న సాహో టీం ఇక యంగ్రెబల్స్టార్ ప్రభాస్ ను రంగంలోకి దింపుతుంది. ప్రభాస్ సాహో ప్రమోషన్ కోసం తన టీంను వెంటెసుకుని దుబాయ్ చెక్కెయాలని చూస్తున్నారు. సాహో హాలీవుడ్ తరహాలో తెరకెక్కుతుండగా, దుబాయ్లోనూ ప్రభాస్కు మార్కెట్ ఉంది. అందుకే దుబాయ్లో ఈనెల29న ప్రిమియర్ షో వేయనున్నారు. అందుకే ప్రభాస్ తన టీంతో దుబాయ్కు వెళ్ళనున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ను ఈనెల 10న ముంబాయిలో లాంచ్చేసి, తదుపరి 11న హైదరాబాద్లో ప్రేస్మీట్ ఉంటుందట. సో సినిమా ప్రమోషన్ ఘనంగా చేయనున్నట్లు టీం ప్రకటించింది.

Leave a comment