తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై రానా సీరియస్!

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది నట వారసులు ఎంట్రీ ఇచ్చారు. మొదటి సారిగా స్టార్ ప్రొడ్యూసర్ డి. రామనాయుడు తనయుడు వెంకటేష్ దగ్గుబాటి హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ప్రస్తుతం తన ఇమేజ్, వయసు కు తగ్గ పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచేస్తున్నారు విక్టరీ వెంకటేష్. ఆయన సోదరుడు స్టార్ ప్రొడ్యూసర్ డి సురేష్ బాబు తనయుడు రానా దగ్గుబాటి ‘లీడర్’ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమా సూపర్ హిట్ అయినా తర్వాత వరుసగా ఫ్లాప్ టాక్ వచ్చాయి.

అయితే కేవలం హీరో ఇమేజ్ చట్రంలోనే ఇమిడిపోకుండా ఎలాంటి పాత్రల్లో అయినా నటించి మెప్పించాలనే తపనతో ఉన్న రానా బాలీవుడ్ లో పలు సినిమాల్లో సహనటుడిగా నటించారు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి ’సీరీస్ లో భళ్లాల దేవుడు లాంటి ప్రతినాయకుడి పాత్రలో నటించి హీరో ప్రభాస్ కి వచ్చిన స్టార్ ఇమేజ్ జాతీయ స్థాయిలో పొందాడు. గత కొంత కాలంగా రానా ఆరోగ్యం పై అనేక కథనాలు వస్తున్నాయి. ఓ బేబి థ్యాంక్స్ మీట్ లో రానా చాలా సన్నగా కనిపించాడని అందుకు అనుమానాలు కూడా కలిగించాయి.

మరోవైపు ఎప్పటి కప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్తున్నా పుకార్లు మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ ఈ వార్తలు ఎక్కువ అవుతుండడం..చాలామంది ఇదా నిజామా అన్నట్లు రానా కుటుంబ సబ్యులకు ఫోన్లు రావడం తో ఇక వీటికి ఫుల్ స్టాప్ పెడదామన్న ఉద్దేశ్యంతో ఈ వార్తలపై స్పందించారు. ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని..గుణ శేఖర్ దర్శకత్వంలో రాబోతున్న “హిరణ్యకశిప” అనే భారీ పౌరాణిక మూవీలో నటించబోతున్నానని.. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్న నేపథ్యంలో రానా అమెరికా వెళ్లినట్లు ఆయన వెల్లడించారు.

అంతే కాదు “హిరణ్యకశిప”మూవీ విజువల్ ఎఫెక్ట్స్, అలాగే మేకప్ తదితర అంశాలకు సంబంధించిన నిపుణులతో రానా చర్చలు జరపడానికే అమెరికా వెళ్లారని, కానీ కొంత మంది తనపై పిచ్చిరాతలు రాస్తూ ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a comment