మ‌న్మ‌థుడు 2 ప‌బ్లిక్ టాక్‌.. హిట్టా.. ఫట్టా..

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన మ‌న్మ‌థుడు 2 భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఈ సినిమా టాక్ కంప్లీట్‌గా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. సినిమాకు బ్యాడ్ టాక్ వ‌స్తోంది. సినిమా చూసిన వారు నాగార్జున ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడా ? అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఎటువంటి ట్విస్ట్ లేని ఈ రీమేక్ మూవీ ప్రేక్షకుడికి అంతగా థ్రిల్ చేయడంలో విఫలమైంద‌నే ఎక్కువ మంది అంటున్నారు.

నాగార్జున ఎంత హ‌డావిడి చేసినా ఈ సినిమా క‌థ‌ను ఇప్ప‌టికే తెలుగు, హిందీ సినిమాల్లో చాలాసార్లు చూసేశాం ? అన్న ఫీలింగ్ వ‌చ్చేసింది. దర్శకుడు రాహుల్ రవీంద్ర మొదటి సగం కొంచెం ఆహ్లాదంగా నడిపినా రెండవ భాగంలో కథను తేల్చేశాడు. సెకండాఫ్‌లో చాలా మంది అయితే నిద్ర పోయాం అని కూడా చెప్ప‌డం చూస్తే సినిమా ఎంత బోర్‌గా ఉందో తెలుస్తోంది.

నాగార్జున,రకుల్ దూరమైన తరువాత నడిచే కథగా అంతగా ఆసక్తిగా సాగలేదు. సినిమాలో ఝాన్సీ కిస్సింగ్ సన్నివేశం లాంటి కొన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బందిగా ఫీలయ్యే సన్నివేశాలు ఉన్నాయి. మ‌రి కొంద‌రు అయితే అస‌లు ఇది నాగార్జున సినిమా అన‌డం కంటే వెన్నెల కిషోర్ సినిమా అంటే క‌రెక్టుగా ఉంటుంద‌ని సెటైర్లు వేస్తున్నారు. వెన్నెల కిషోర్ లేక‌పోతే ఈ సినిమా వ‌ర్మ ఆఫీస‌ర్‌లా బ్లాస్ట్ అయ్యిపోయేదంటున్నారు.

మ‌రి కొంద‌రు మాత్రం ఈ సినిమా కంటే త‌మ‌న్నా సింహాద్రి వ‌చ్చాక బిగ్‌బాస్ 3 షో చాలా బెట‌ర్‌గా ఉంద‌ని దారుణంగా తిట్టిపోస్తున్నారు. మ‌రి కొంద‌రు ఈ వ‌య‌స్సులో నీకు ఇంత రొమాన్స్ అవ‌స‌ర‌మా ? ముస‌లోడా అని ఆడి పోసుకుంటున్నారు. ఏదేమైనా మ‌న్మ‌థుడు 2 ప్లాప్ అయిన‌ట్టే టాక్ చెప్పేస్తోంది.

Leave a comment