రిలీజ్‌కు ముందే హిట్ కొట్టిన ‘ స‌రిలేరు నీకెవ్వ‌రు ‘

మ‌హ‌ర్షి చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న 26వ చిత్రంగా స‌రిలేరు నీకెవ్వ‌రు అనే సినిమా చేస్తున్నారు. టాలీవుడ్లో వ‌రుస సూప‌ర్ హిట్ సినిమాల‌తో దూసుకుపోతోన్న యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని స‌మాచారం. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుతో పాటు అనిల్ సుంక‌ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇంట్రో టీజ‌ర్ ఈ రోజు మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌ల చేశారు.

ఆర్మీ మేయర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో మ‌హేష్ లుక్ అదిరిపోయింది. ఫ‌స్ట్ లుక్‌ని చూసి ఈ చిత్రం భారీ విజ‌యం సాధించ‌డం ఖాయం అని అభిమానులు జోస్యాలు చెబుతున్నారు. ఇందుకు వారు ఓ సెంటిమెంట్ కూడా చెపుతున్నారు. మ‌రి ఆ సెంటిమెంట్ ఈ సినిమా విష‌యంలో రిపీట్ అయితే స‌రిలేరు నీకెవ్వ‌రు సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డం ఖాయం.

మ‌హేష్ బాబు కెరీర్‌లో భారీ విజ‌యం సాధించిన ఒక్క‌డు, దూకుడు చిత్రాల‌లో మ‌హేష్‌ అజ‌య్ అనే పాత్ర‌లో క‌నిపించి మెప్పించాడు. మ‌హేష్ కెరీర్ డౌన్‌లో ఉన్న‌ప్పుడు వ‌చ్చిన ఈ రెండు సినిమాలు ఒక్క‌సారిగా మ‌హేష్ కెరీర్‌ను మ‌లుపు తిప్పేశాయి. ఇప్పుడు స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలోను అజ‌య్ పాత్ర‌లోనే న‌టిస్తున్నాడు.

ఈ నేమ్ సెంటిమెంట్ ప‌రంగాను ఈ సినిమా భారీ హిట్ కొట్ట‌డం ఖాయం అంటున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రి అజ‌య్ పేరు మ‌హేష్‌కు ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో ? చూడాలి.

Leave a comment