కొబ్బరిమట్ట ఫస్ట్ రివ్యూ

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కొబ్బరిమట్ట అప్పుడెప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. కాగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో అక్కడ ఈ సినిమాను చూసిన వారు ఈ వీకెండ్‌లో వచ్చిన సినిమాల్లో కొబ్బరిమట్టకే ఓటేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా ఆధ్యాంతం సంపూ తనదైన మార్క్ కామెడీతో కడుపుబ్బ నవ్వించాడు. ఈ సినిమాకు కథే ఒక హైలైట్ కాగా సంపూ యాక్టింగ్‌తో చింపేసాడు. మూడు విభిన్న పాత్రల్లో నటించడమే కాకుండా నాన్-స్టాప్ లాంగ్ డైలాగ్‌తో వరల్డ్ రికార్డును సైతం సృష్టించాడు మనోడు. ఇక సంపూ వేసిన స్టెప్స్‌ సినిమాకు మరో హైలైట్‌గా నిలిచాయి. సంపూతో పాటు ఇందులో చాలా మంది ఆర్టిస్టులు నటించారు. వారందరూ తమదైన కామెడీ యాక్టింగ్‌తో రచ్చ రంబోలా చేశారు.

ఇక సినిమా కథలో ఫస్టాఫ్‌లో హీరో పాత్రలను ఇంట్రొడ్యూస్ చేసిన విధానం, వాటి ద్వారా పండించిన కామెడీ ఆడియన్స్‌ పగలబడి నవ్వారు. ఇక సెకండాఫ్‌లో కాస్త సీరియస్ మూడ్‌లోకి తీసుకెళ్లినట్లే వెళ్లి.. మళ్లీ క్లైమాక్స్‌ను కామెడీతో ముగించిన విధానంతో సినిమాను ఫుల్లుగా ఎంజాయ్ చేశారు ఆడియెన్స్.

ఏదేమైనా కొబ్బరిమట్ట పేరుకు తగ్గట్టుగానే నాన్-స్టాప్ కామెడీ మూవీగా, సంపూను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇక ఈ సినిమాను ఇక్కడి ప్రేక్షకులు ఎంతమేర ఆదరిస్తారో చూడాలి.

Leave a comment