మన్మధుడు 2 కలెక్షన్స్.. ఎక్కడో తేడా కొడుతుంది చిన్నా!

అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ మన్మధుడు2 నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో నాగ్ మరోసారి బ్లాక్‌బస్టర్ వద్ద సందడి చేస్తున్నాడు. అయితే గతంలో వచ్చిన మన్మధుడు సినిమా ప్రభావంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా కాస్త తడబడింది.

పబ్లిక్ టాక్, రివ్యూల ప్రకారం ఈ సినిమా యావరేజ్‌టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ నాగ్ సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి ఆదరణ లభిస్తుంటుంది. అయితే అక్కడ ఈ సినిమాను ప్రీమియర్ల ద్వారా చూసిన జనం పెదవి విరిచారు. గురువారం ప్రీమియర్ల ద్వారా మన్మధుడు 2 చిత్రం 82,284 డాలర్ల వసూళ్లు సాధించింది. ఇక శుక్రవారం అక్కడి సమయం ప్రకారం సాయంత్రం 5.30 గంటల వరకు మరో 23, 766 డాలర్లు వసూలు చేసి టోటల్‌గా 123,236 డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకున్న మన్మధుడు2 ఈ వీకెండ్‌ను ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. అయితే దీనికి వస్తున్న టాక్‌ దృష్ట్యా ఈ సినిమా లాభాలను గడించడం చాలా కష్టం అని అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. మరి నాగ్‌కు మన్మధుడు2 పీడకలు మిగిలిస్తుందా అనేది సినిమా టోటల్‌ రన్‌లో తేలనుంది.

Leave a comment