నాని గ్యాంగ్‌లీడ‌ర్ కి మరో ఊహించని షాక్‌…

నేచురల్ స్టార్ నాని – విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. సరికొత్త కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాను ముందునుంచి రిలీజ్ క‌ష్టాలు వెంటాడుతున్నాయి. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 30 న ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని మేకర్స్ ముందుగా ప్లాన్ చేశారు. అయితే ఆగ‌స్టు 15న రావాల్సిన సాహో ఆగస్టు 30కి లాక్ అవ్వ‌డంతో గ్యాంగ్‌లీడ‌ర్‌ను సెప్టెంబ‌ర్ 13కు వాయిదా వేశారు. కానీ ఇప్పుడు ఈ తేదికి కూడా వస్తుందో రాదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నాని గ్యాంగ్‌లీడ‌ర్‌ను ముందు నుంచి సోలోగా రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. సెప్టెంబర్ 13న వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కుతున్న ‘వాల్మీకి’ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉండడం తో ఒకేసారి ఈ రెండిటిని విడుదల చేస్తే కలెక్షన్లతో పాటు థియేటర్స్ సమస్య కూడా ఉంటుందని ఆయా చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట.

ఇక నాని మాత్రం త‌న సినిమాను సోలోగానే రిలీజ్ చేసి మంచి వ‌సూళ్లు రాబ‌ట్టుకోవాల‌ని చూస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమాను వాయిదా వేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారని..గ్యాంగ్ లీడర్‌నే మరో తేదికి విడుదల చేసే ప్లాన్ చేస్తున్న‌ట్టు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా గ్యాంగ్ లీడ‌ర్‌ను మ‌ళ్లీ వాయిదా వేస్తే మూడో రిలీజ్ డేట్ అవుతుంది. ఇప్ప‌టికే రెండుసార్లు రిలీజ్ చేయాల‌నుకున్న డేట్ల‌కు పోటీగా సినిమాలు రావ‌డంతో ఇప్పుడు నాని సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కు ఈ క‌ష్టాలు త‌ప్పేలా లేవు.

Leave a comment